బాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్న ‘క్వీన్’ చిత్రాన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కంగనాకు ఎంతో పేరుతెచ్చి పెట్టింది. ఆమె జాతీయ అవార్డును అందుకున్నది. కాగా తెలుగు రీమేక్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. తమిళంలో కాజల్ నటించింది. కాగా ఆర్థికసమస్యతో ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో చిత్రీకరణ పూర్తిచేసుకున్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారని టాక్. తెలుగులో ‘దట్ ఈజ్ మహాలక్ష్మీ’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాలి.