![తెలంగాణ పోలీస్‌పై షార్ట్ ఫిలిం, ఫొటో కాంటెస్ట్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/police-1.jpg?fit=211%2C300&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం, ఫొటో కాంటెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఈ పోటీలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తెలంగాణ పోలీసులపై తాము తీసిన ఫొటోలు, షార్ట్ ఫిలింలను పంపించవచ్చు. షార్ట్ ఫిలింల నిడివి 3 నిమిషాలలోపే ఉండాలి. అలాగే తమ షార్ట్ ఫిలింలు, ఫొటోలను ఔత్సాహికులు అక్టోబర్ 18వ తేదీ లోపు పంపించాల్సి ఉంటుంది. ad@scsc.in అనే మెయిల్ ఐడీకి వీడియోలు, ఫొటోలను పంపించవచ్చు. మరిన్ని వివరాలకు 9000257058 అనే ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.