Breaking News

తెలంగాణలో టెన్త్​ ఎగ్జామ్స్​ వాయిదా

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్ర హైకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రంలో జరిగే 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శనివారం సాయంత్రం ప్రకటించారు. ఎగ్జామ్స్​ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్​ వద్ద సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆమె స్పష్టంచేశారు. అయితే అంతకుముందు తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్‌ పరీక్షలు నిర్వహణకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నందున ఆ రెండు జిల్లాల పరిధిలో పరీక్షలను వాయిదా వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. విద్యార్థులకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా పరీక్షాకేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.