Breaking News

తెలంగాణలో కుండపోత వాన

తెలంగాణలో కుండపోత వర్షాలు

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు వరద పోటెత్తుతున్నాయి. దీంతో తెలంగాణ తడిసి ముద్దయింది. కొన్నిప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అధికారులంతా హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని ఆదేశాలు జారీచేసింది. వర్షాలు, వరదలు దృష్ట్యా అధికారులకు ప్రభుత్వం సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్ సూచించారు. ప్రజలు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వచ్చే 24 గంటల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీనుంచి అతి భారీవర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.