Breaking News

తెలంగాణకు వర్షసూచన

తెలంగాణకు వర్షసూచన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సోమ‌వారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన‌ తేలికపాటి నుంచి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.