Breaking News

తుంగభద్ర పుష్కరాలకు పక్కాగా ఏర్పాట్లు

తుంగభద్ర పుష్కరాలకు పక్కాగా ఏర్పాట్లు

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): అయిజ మండలం వేణిసొంపురం గ్రామంలో తుంగభద్ర నది పుష్కరాల ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే అబ్రహం పరిశీలించారు. విద్యుద్దీకరణ, మహిళల స్నానాల గదులు, వాహనాల పార్కింగ్ స్థలం.. తదితర వాటికి సంబంధించి అడిషనల్​ కలెక్టర్ ​శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ కృష్ణ, ఆర్డీవో రాములుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. రాష్ట్రంలో తుంగభద్ర నది ఒక్క అలంపూర్ నియోజకవర్గంలో మాత్రమే ప్రవహిస్తుందని, పవిత్రమైన పుష్కరాలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న దృష్ట్యా సీఎం కేసీఆర్ ​ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఆయన వెంట సింగిల్​విండో చైర్మన్​మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, రాజోలి ఎంపీపీ నాథనేలు, డీఎస్పీ యాదగిరి తదితరులు ఉన్నారు.

తుంగభద్ర నది పుష్కర ఘాట్లను పరిశీలిస్తున్న జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ ఎమ్మెల్యే అబ్రహం