సారథి న్యూస్, తుంగభద్ర పుష్కరాలు: తుంగభద్ర నది పుష్కరాలకు భక్తజనం పోటెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి రావడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలొచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. రాజోలిలోని పుల్లూరు, అయిజ మండలం వేణిసోంపురం ఘాట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ స్నానాలు చేసిన అనంతరం అలంపూర్ జోగుళాంబ అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
:: ఫొటోలు, సాధిక్, మానవపాడు