సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తుంగభద్ర నదిలో పుట్టిలో వెళ్తూ గల్లంతైన రవికుమార్ మృతదేహం ఆచూకీ మంగళవారం దొరికింది. నదిలోనే చేపలవలకు డెడ్‌బాడీ చిక్కింది. పోస్టుమార్టం కోసం అలంపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, తుమ్మిళ్ల గ్రామానికి చెందిన అంజి, రాఘవేంద్ర ప్రతిరోజు మద్యం సరుకును తుంగభద్ర నది నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రవికుమార్ కు చెందిన పుట్టిలో 36మద్యం కేసులను తీసుకుని అవతలి వైపునకు దాటుతున్నారు. మార్గమధ్యంలో పుట్టి మునిగిపోవడంతో రవికుమార్ తుంగభద్రలో గల్లంతైన విషయం తెలిసిందే. అతని కోసం ఆచూకీ కోసం శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు అక్కడే రోజంతా ఉండి పర్యవేక్షించారు. రవికుమార్ విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈఘటనతో తుమ్మిళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- August 18, 2020
- Archive
- Top News
- క్రైమ్
- GADWALA
- MANAVAPADU
- THUMMILA
- TUNGABADRA
- జోగుళాంబ గద్వాల
- తుంగభద్ర
- మానవపాడు
- Comments Off on తుంగభద్రలో తేలిన యువకుడి డెడ్‌బాడీ