న్యూఢిల్లీ: ఫుల్లుగా మద్యం తాగి కారు నడిపిన ఓ పోలీసు వేగం అదుపు తప్పి మహిళను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రమాదానికి కారణమైన పోలీస్ ఆఫీసర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఢిల్లీలోని చిల్లా గ్రామం సమీపంలో ఒక పోలీస్ ఆఫీసర్ రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు. దాన్ని గమనించిన స్థానికులు ఆమెను కాపాడేందుకు దగ్గరికి వచ్చేలోపే కారును మళ్లీ ఆమెపై నుంచి పోనిచ్చాడు. దీంతో కారుతో పాటు ఆమె కొంత దూరం వెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికంగా హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ ఘటన మొత్తం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైంది. దాని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా.. యాక్సిడెంట్ చేసిన సమయంలో ఆ వ్యక్తి ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నాడని అన్నారు.
- July 4, 2020
- Archive
- జాతీయం
- DELHI
- DRUNK AND DRIVE
- POLICE
- డ్రంకెన్ డ్రైవ్
- ఢిల్లీ
- పోలీసు
- Comments Off on తప్పతాగి కారు డ్రైవింగ్