సారథి న్యూస్, హుస్నాబాద్: భూ తగాదాలతో ఓ వ్యక్తి కన్నతండ్రినే హతమార్చాడు. ఈ దారుణఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లిలో చోటుచేసుకున్నది. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం..గండిపల్లికి చెందిన లూనావత్ సోమ్లా నాయక్ (74)కు కొంత కాలంగా కుమారుడు సమ్మయ్యతో భూమివిషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సోమ్లానాయక్ తన పొలం దగ్గరకు వెళ్తుండగా కుమారుడు సమ్మయ్య అడ్డగించాడు. భూమి విషయంలో ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన సమ్మయ్య.. క్షణికావేశంలో తండ్రిని కర్రతో తలమీద బలంగా కొట్టాడు. దీంతో సోమ్లానాయక్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని భార్య మణేమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాస్, ఎస్సై రవి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- June 14, 2020
- Archive
- క్రైమ్
- మెదక్
- FATHER
- HUSNABAD
- MURDER
- SON
- క్షణికావేశం
- భూతగాదాలు
- Comments Off on తండ్రిని చంపిన కొడుకు