న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తాత్కిలిక హెల్త్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. హెల్త్ మినిస్టర్ సత్యేంద్రజైన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో సిసోడియాను టెంపరరీ హెల్త్ మినిస్టర్‌గా నియమించారు. ఆ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి ఇక నుంచి సిసోడియా మానిటర్ చేస్తారని అధికారులు చెప్పారు. సత్యేంద్ర జైన్ అస్వస్థతకు గురవడంతో ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. మొదటిరోజు టెస్టులు చేయగా కరోనా నెగటివ్ వచ్చింది.
కాగా, బుధవారం నిర్వహించిన టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. ఆయనకు ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చి ట్రీట్‌మెంట్ చేస్తున్నామన్నారు. మంత్రితో పాటు ఆప్ ఎమ్మెల్యే అతిషి, ఇద్దరు పార్టీ నేతలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. సీఎం అడ్వైజర్ డిప్యూటీ సీఎం అడ్వైజర్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్లందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచారని, ఎలా సోకిందనే విషయంపై ఆరా తీస్తున్నామని అధికారులు చెప్పారు.