ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతున్నది. గత 24 గంటల్లో కేవలం 1,246 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత 35 రోజుల్లో ఇంత తక్కువ కేసులు రావడం ఇదే ప్రథమం. కాగా ఇక్కడ కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. 91,312 మంది కరోనా చికిత్సపొంది కోలుకున్నారు. రికవరి రేటు 80.28 శాతం ఉన్నదని వైద్యశాఖ అధికారులు తెలిపారు. అధికంగా టెస్టులు చేయడం, పాజిటివ్ రోగులకు మెరుగైన వైద్యం చేయడంతోనే కరోనా అదుపులో ఉందని అధికారులు తెలిపారు. ప్రజల కూడా ప్రభుత్వానికి సహకరించాలని.. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు.