సారథి న్యూస్, హైదరాబాద్: ఇండో- చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఆమె బీఆర్ కే భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. సంతోషికి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ ఇస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొన్నిరోజుల క్రితమే ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వ అండగా ఉంటుందని సీఎం వారికి హామీఇచ్చారు. అందులో భాగంగానే ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు.
- August 15, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- COLONEL SANTHOSHBABU
- DEPUTYCOLLECTOR
- INDOCHINA BORDER
- SANTHOSHI
- కల్నల్సంతోష్బాబు
- డిప్యూటీ కలెక్టర్
- సంతోషి
- సూర్యాపేట
- Comments Off on డ్యూటీలో చేరిన కల్నల్ సంతోష్ బాబు సతీమణి