సారథిన్యూస్, ఖమ్మం: ఓ పోలీస్ అధికారి తీసుకున్న చొరువ నిండు ప్రాణాన్ని రక్షించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా రోగులను ఎవరూ దగ్గరికి రానీయడం లేదు. ఈ క్రమంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని పోలీస్అధికారి సకాలంలో దవాఖానలో చేర్పించి ఆమె ప్రాణాలను కాపాడారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణం.. ఎస్సీ కాలనీకి చెందిన ఒక గర్భిణికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాగా శుక్రవారం రాత్రి సదరు మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. చుట్టుపక్కల ప్రజలు మహిళను ఆస్పత్రిలో చేర్పించేందుకు ముందుకెళ్లలేదు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఖమ్మం అడిషనల్ డీసీసీ మురళీధర్ ఆమెను హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం రాత్రి మహిళ గాంధీ ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. డీసీపీ మురళీధర్‌కు.. బాధితకుటుంబసభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.