తెలుగులో ‘హార్ట్ ఎటాక్, క్షణం’ సినిమాలు ఆదాశర్మకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి హిట్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. రీసెంట్గా రాజశేఖర్ సినిమా ‘కల్కి’లో హీరోయిన్గా కూడా ఆకట్టుకుంది. అయినా తెలుగులో ఆశించిన అవకాశాలు ఆమెకు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్‌లో అడపాదడపా సినిమాలను చేస్తోంది. అయితే తెలుగు అభిమానులు నా నుంచి ఓ మంచి సినిమా కోరుకుంటున్నారు, అందుకే ఈ సినిమాకు సంతకం చేశానంటోంది ఆదాశర్మ. విప్రా దర్శకత్వంలో ఆదాశర్మ ప్రధానపాత్రలో గౌరు ఘానా సమర్పణలో గౌరీకృష్ణ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ముందుగా హైదరాబాద్లో మొదటి షెడ్యూల్, ఆ తర్వాత నిర్మల్ లో రెండో షెడ్యూల్ చేస్తామని విప్రా చెప్పారు. ఈ చిత్రంలో సంజయ్, భానుశ్రీ, అభయ్, హరితేజ, అక్షిత శ్రీనివాస్ నటిస్తున్నారు.
- July 29, 2020
- Archive
- Top News
- సినిమా
- ADASHARMA
- GOURUGHANA
- HEARTATTACK
- ఆదాశర్మ
- రాజశేఖర్
- హార్ట్ఎటాక్
- Comments Off on డిఫరెంట్గా వస్తా..