Breaking News

టీ సర్కార్​కు హైకోర్టు కీలక ఆదేశాలు

సారథిన్యూస్​, హైదరాబాద్​: జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాతో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారిని రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ వర్కింగ్​ జర్నలిస్ట్​ ఫెడరేషన్​ నాయకుడు సత్యనారాయణ హైకోర్టులో రిట్​ పిటిషన్​​ దాఖలు చేశారు. నాలుగు నెలలుగా జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆర్టికల్ 14 ప్రకారం జర్నలిస్టులను ఆదుకోవాలని పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. స్పందించిన ధర్మాసనం.. పిటిషనర్​ విన్నవించిన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ నాలుగు వారాల తరువాత ఈ కేసుకు సంబంధించిన వివరాలు వింటామని పేర్కొన్నది.