సారథి న్యూస్, హుస్నాబాద్: టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని కరీంనగర్ పార్లమెంటరీ ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ బత్తుల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం హుస్నాబాద్ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయకపోవడంతో ఉపాధి లేక యువత ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుపతి, శ్రీనివాస్, వెంకట్రాజాం, సంతోష్, మల్లేశం, రాజు కుమార్, సింగారయ్య, శంకర్, శ్రీనివాస్, సుభాష్, వెంకటేశ్, హనుమంతు, వీరయ్య పాల్గొన్నారు.
- June 16, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- HUSNABAD
- TDP
- ఆర్గనైజింగ్ కమిటీ
- సిద్దిపేట
- Comments Off on టీడీపీకి పూర్వ వైభవం తెస్తాం