నెపొటిజం వివాదం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కరీనా కపూర్‌కు చుట్టుకుంది. బైకాట్ కరీనా కపూర్ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాష్‌ట్యాగ్‌లు హోరెత్తుతున్నాయి. కరీనాకపూర్ సినిమాలను చూడొద్దంటూ నెట్‌జన్లు పిలుపునిస్తున్నారు. ఇందుకు కారణమేమిటంటే.. సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో నెపొటిజం తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీతారలు కూడా బాలీవుడ్లో బంధుప్రీతి ఉన్నదని ఒప్పుకున్నారు. కంగనా లాంటి హీరోయిన్లు ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు కూడా. ఈ నేపథ్యంలో కరీనా ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ బాలీవుడ్లోనే కాదు ఏ రంగంలోనైనా ట్యాలెంట్ ఉన్నవాళ్లే రాణిస్తారని చెప్పుకొచ్చారు. ఈ మాటలతో అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది అంతే కరీనా కపూర్‌ను టార్గెట్ చేశారు.