Breaking News

జోగుళాంబకు రూ.55.68లక్షల ఆదాయం

సారథి న్యూస్​, అలంపూర్​: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపురం పుణ్యక్షేత్రమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల హుండీలను ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు పర్యవేక్షణలో మంగళవారం లెక్కించారు. హుండీలో రెండు యూఎస్​ డాలర్లు, ఐదు యూరోలు లభించాయి. వీటితో పాటు అమ్మవారి ఆలయంలో 62.800 మి.గ్రా. మిశ్రమ బంగారం, 620 మి.గ్రా మిశ్రమ వెండి వచ్చింది. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో 110మి.గ్రా. మిశ్రమ వెండి, ఒక యూఎస్​ డాలర్ వచ్చింది. అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.65,463 ఆదాయం సమకూరింది. మొత్తంగా రూ.55,68,781 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు.తహసీల్దార్​ మదన్ మోహన్, ఆలయ ముఖ్య అర్చకుడు దిండిగల్​ ఆనంద్ శర్మ, శేఖర్, శ్రీనివాసులు, రంగనాథ్, బ్రహ్మయ్య ఆచారి, ధనుంజయ శర్మ, త్యాగరాజు, కృష్ణమూర్తి శర్మ, వివేకానంద యూత్, జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.