యువహీరో నాని, శ్రద్ధా శ్రీనిథ్ జంటగా నటించిన జెర్సీ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కెనడాలోని టోరంటలో జరిగే ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది. తమ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి పేర్కొన్నారు. ఆగస్టు 9 నుంచి, 15 వరకు టోరంటోలో ఫిలిం ఫెస్టివల్ నిర్వహించనున్నారు. క్రికెట్ నేపథ్యంతో నాని, శ్రద్ధాశ్రీనాథ్ జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ జెర్సీ చిత్రాన్ని నిర్మించింది.గౌతమ్ తిన్నసూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనిరుద్ అందించిన బాణీలు ప్రేక్షకులను అలరించాయి. డిప్రెషన్‌కు గురైన ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరచుకొని మళ్లీ ఎలా విజయతీరాలను తాకాడనే కథతో తెరకెక్కిన ‘జెర్సీ’ చిత్రానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు దక్కడం తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన గొప్ప గౌరవమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
- August 1, 2020
- Archive
- Top News
- సినిమా
- CANDA
- JERSI
- TORANTO
- జెర్సీ
- ఫిలిం ఫెస్టివల్
- Comments Off on ‘జెర్సీ’కి అంతర్జాతీయ గుర్తింపు