సారథి న్యూస్, నల్లగొండ : కరోనా విజృంభిస్తున్న తరుణంలో నల్లగొండ పట్టణంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ వ్యాపారస్తులతో తన క్యాంపు ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జులై 30 నుంచి 14 తేదీ వరకు వ్యాపారస్తులు నల్గొండలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించాలన్నారు. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకుల దుకాణాలు మధ్యాహ్నం 1 గంటవరకు తెరిచి ఉంచుతారని, ఇంకా మెడికల్ షాపులు, హాస్పిటళ్లు ఈ లాక్ డౌన్ నుంచి మినహాయించడం జరిగిందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమావేశంలో చెప్పారు. కరోనా తీవ్రత ఎక్కువడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు, దీనిని అన్ని వ్యాపార రంగాలవారు, పట్టణ ప్రజలందరూ పాటించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ వ్యాపారస్తులు పాల్గొన్నారు.