సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు నీటి ఉధృతి పెరుగుతోంది. గతవారం 27 గేట్లను ఎత్తగా, అదేస్థాయిలో మంగళవారం సాయంత్రం కూడా 27 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గంటగంటకూ వరద పెరుగుతుండడంతో నదీతీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ప్రస్తుతం 2.27లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
- September 22, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- JOGOLAMBAGADWALA.
- JURALA
- NARAYANAPUR
- జూరాల
- జోగుళాంబ గద్వాల
- నారాయణపూర్
- Comments Off on జూరాల 27గేట్ల ఎత్తివేత