సారథిన్యూస్, మానోపాడు: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి చిన్న ఆముదాలపాడు మధ్యన ఉన్న జూరాల లింక్ ఆర్ డీఎస్ ప్రధాన కాల్వకు భారీ గండి పడింది. దీంతో రెండు రోజులుగా పంటపొలాల్లో కాలువ నీరు ప్రహిస్తుండంతో పొలాలు ఆగమవుతున్నయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఈ కాలువ పరిస్థితి ఇదేవిధంగా ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. ప్రధాన కాలువలో సీల్టు తీయకపోవడం వల్లే ఈ గండ్లు ఏర్పడుతున్నాయని సమీప బాధిత రైతులు వాపోతున్నారు. వెంటనే ఆర్డీఎస్ కెనాల్ అధికారులు స్పందించాలని రైతు కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న కోరుతున్నారు.