Breaking News

జూన్​ 8 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​

  • పదోతరగతి పరీక్షల షెడ్యూల్​ విడుదల చేసిన ప్రభుత్వం

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, కోవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్​ 8వ తేదీ నుంచి జులై 5 వరకు పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు పరీక్ష నిర్వహించాలని.. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఇస్తూ షెడ్యూల్​ విడుదల చేసింది. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే విద్యార్థులను ఎగ్జామ్స్​కు అనుమతించనున్నారు. ఆదివారం కూడా పరీక్ష నిర్వహిస్తారు. బెంచీకి ఒకరిచొప్పున కూర్చొబెట్టి ఎగ్జామ్స్​ నిర్వహించాలని నిర్ణయించారు.
ఇది షెడ్యూల్​
8న(సోమవారం) ఇంగ్లిష్ పేపర్​–1,
11న(గురువారం) ఇంగ్లిష్​ పేపర్​–2
14న(ఆదివారం) మ్యాథ్స్​ పేపర్​–1
17న(బుధవారం) మ్యాథ్స్​ పేపర్​–2
20న(శనివారం) సైన్స్​ పేపర్​​–1
23న(మంగళవారం) సైన్స్​ పేపర్​–2
26న(శుక్రవారం) సోషల్​​ పేపర్​–1
29న(సోమవారం) సోషల్​ పేసర్​–2
జులై 2న(గురువారం) ఓరియంటల్​ లాంగ్వేస్​ పేపర్​–1
5న(ఆదివారం) ఒకేషనల్​ కోర్సు(థియరీ)