వాషింగ్టన్: అమెరికాకు చెందని పౌరహక్కుల నేత, కాంగ్రెస్ సభ్యుడు జాన్ లూయిస్(80) ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా ఆయన ప్యాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. జాన్ అమెరికాలో ఎన్నో పౌరహక్కుల ఉద్యమాలు చేశారు. యూఎస్ ప్రతినిధుల సభలోనూ సభ్యుడికి వ్యవహరించారు. 1965లో ఆయనను అమెరికన్ పోలీసులు దారుణంగా కొట్టారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు ప్రాణాలతో బయటపడ్డ జాన్ పౌరహక్కుల ఉద్యమనేతగా ఎదిగారు. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన మృతికి అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా సహా పలువురు సంతాపం తెలిపారు.