సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ప్రజలంతా జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారిని జయించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సూచించారు. కరోనా వచ్చినవారు భయపడాల్సిన అవసరం లేదని.. దేశంలో 70 శాతం మంది వ్యాధి నుంచి కోలుకుంటున్నారని ఆమె భరోసా కల్పించారు. బుధవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలకేంద్రంలో ఆమె పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు కూడా కరోనా రోగులపై వివక్ష చూపించవద్దని కోరారు. కరోనా వచ్చినంతమాత్రాన వారి కుటుంబాలను వెలివేయడం తగదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావు, సర్పంచ్ రాజిరెడ్డి,ఎంపీటీసీ రాధిక, మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ ఆవుల గోపాల్ రెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పట్లోరి రాజు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, సర్పంచులు బందెల జ్యోతి, శ్రీలత, మీనా, సాన సాయిలు, శ్రీనివాస్ రెడ్డి, భిక్షపతి గౌడ్, పూలపల్లి యాదగిరి యాదవ్, సిద్ది రామ్ రెడ్డి, పోచయ్య, లక్ష్మణ్, ఎంపీటీసీలు భాషిపల్లి యాదగిరి, ప్రసాద్ గౌడ్, నాయకులు సాన సత్యనారాయణ, కుమార్ గౌడ్, బండారు స్వామి, కుంట నరేష్, యాదవరావు తదితరులు పాల్గొన్నారు.
- August 19, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- CM
- KCR
- MLA
- PADMA DEVENDERREDDY
- TELANGANA
- తెలంగాణ
- సీఎం కేసీఆర్
- Comments Off on జాగ్రత్తలతో కరోనాను జయిద్దాం