Breaking News

జర్నలిస్ట్​ మనోజ్​కు ఘననివాళి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఇటీవల కరోనా వ్యాధితో మృతిచెందిన జర్నలిస్ట్​ మనోజ్​కుమార్​ కు జర్నలిస్టులు, పలువురు రాజకీయ పార్టీల నేతలు గురువారం సాయంత్రం హైదరాబాద్​లోని గన్​పార్క్​ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రారావు, సీపీఐ నేత చాడ వెంకట్​రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్​ చెరుకు సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ క్యాండిల్​ వెలిగించి నివాళులర్పించారు. మనోజ్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయాలన్నారు.