Breaking News

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితి పొడిగింపు

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితి పొడిగింపు

సారథి న్యూస్, విజయవాడ: ఆంధ్రప్రదేశ్​రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి జూన్ 30 నాటికి ముగిసిందని, మరో మూడునెలల పాటు పెంచుతున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 1 నుంచి సెప్టెంబర్​ 30వ తేదీ వరకు కొత్త కార్డులను జారీచేయడం లేదా, కరోనా పరిస్థితి ఇలాగే ఉంటే మరోసారి కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు ఈ విషయాన్ని గమనించి సంబంధిత జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆఫీసుకు వెళ్లి పొడగింపు అనుమతిని పొందాలని సూచించారు.