Breaking News

జయశంకర్​ ఆశయ సాధనకు కృషి

జయశంకర్​ ఆశయ సాధనకు కృషి

సారథి న్యూస్, రామడుగు: ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి మలి వరకు అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణకు జైకొట్టిన వారికి పబ్బతి పట్టి ఇమ్మతి ఇచ్చిన ఇమాందార్ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ఎస్సై అనూష పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్​లో గురువారం జయశంకర్ చిత్రపటానికి పూలమాలల నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ర్టసాధనకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.