Breaking News

జనార్దన్​రెడ్డి సేవలు మరువలేనివి

సారథిన్యూస్​, గోదావరిఖని/రామగుండం: గోదావరిఖని నియోజకవర్గానికి గీట్ల జనార్దన్​రెడ్డి సేవలు మరువలేనివని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. సాహితీవేత్తగా, రాజకీయనాయకుడిగా గీట్ల ఈ ప్రాంతానికి ఎన్నోసేవలు చేశారని కొనియాడారు. శుక్రవారం ఆయన 82వ జయంతి సందర్భంగా గోదావరిఖనిలోని గీట్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయన సేవలకు గుర్తుగా మంత్రి కొప్పుల ఈశ్వర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని 10, 48వ డివిజన్లలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్​ కుమ్మరి శ్రీనివాస్, మేకల సదానందం, నాయకులు ఎల్ రాజయ్య, దామోదర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నూతి తిరుపతి, అచ్చవేణు, బోడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.