Breaking News

జడలు చుట్టి వరి పంటను కాపాడుకోవాలి

జడలు చుట్టి వరి పంటను కాపాడుకోవాలి

సారథి న్యూస్, రామాయంపేట: వర్షాలకు కింద పడిపోయిన వరి పంటను జడలు చుట్టే పద్ధతిలో కట్టుకుంటే పంటను రైతులు కాపాడుకోవచ్చని నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీష్ సూచించారు. ఆయన సోమవారం మండల పరిధిలోని నస్కల్, చౌకత్ పల్లి, కల్వకుంట, తిప్పనగుళ్ల గ్రామాల్లో నేలకు ఒరిగిన పంట పొలాలను పరిశీలించి పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించారు. గింజగట్టి పడి కోత దశలో ఉన్న వరి పంటకు 50 గ్రాముల ఉప్పును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏఈవోలు గణేష్ కుమార్, శ్రీలత, దివ్య, పలువురు రైతులు ఉన్నారు.