Breaking News

‘జగనన్న విద్యాకానుక’ ఇదే

అమరావతి: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందజేయాలని నిర్ణయించింది. ఆరు వస్తువులను కిట్టు రూపంలో ఇవ్వనుంది. అందులో ఏయే వస్తువులు ఉంటాయనన్న ఆసక్తి ఇటు విద్యార్థులు, అటు వారి పేరెంట్స్​కు ఉంది. వాటిని ఆగస్టు నెలాఖరు నాటికి ఎంఆర్సీలకు అందజేయనున్నారు. వీటిని సరఫరా చేసేందుకు ఇటీవల సీఎం వైఎస్ ​జగన్​మోహన్​రెడ్డి ఆదేశాల మేరకు టెండర్లు కూడా పిలిచారు. ఆయా సంస్థలు ఇప్పటికే ఆయా జిల్లాలకు వస్తువులను పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆగస్టు చివరి నాటికైనా రాష్ట్రంలోని అన్ని ఎమ్మార్సీ సెంటర్లకు ఈ కిట్లను అందజేయాలని నిర్ణయించారు. స్కూళ్లు రీఓపెన్​ కాగానే, వాటిని హెచ్ఎంలకు అందజేస్తారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా స్కూళ్లను ఓపెన్​ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా విద్యార్థులు అకడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేలా చూడాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కొత్తగా అడ్మిషన్లను తీసుకునే వారిసంఖ్య ఆధారంగా ఆంధ్రప్రదేశ్​లో 42 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45వేల ప్రభుత్వ స్కూళ్లు ఉండగా, వాటన్నింటికీ అందించాల్సిన కిట్లను రెడీ చేస్తున్నారు.


విద్యాకానుకలో వస్తువులు ఇవే..
ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు అందజేసే ‘జగనన్న విద్యాకానుక కిట్ల’లో ఆరు రకాల వస్తువులు ఉంటాయి. విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, నోట్ బుక్స్, షూస్, సాక్స్, బెల్ట్, బ్యాగ్, టెక్స్ట్ బుక్స్ కిట్ల రూపంలో అందజేయనున్నారు. స్టూడెంట్స్​కు నేవీ బ్లూ రంగు యూనిఫాం, విద్యార్థినులకు స్కై బ్లూ రంగు యూనిఫాం అందజేయాలని సీఎం అధికారులు ఆదేశాలు జారీచేశారు. 1 నుంచి 3వ తరగతి విద్యార్థులకు చిన్న బ్యాగ్, 4- 6వ తరగతుల విద్యార్థులకు మీడియం సైజ్, 7 నుంచి 10వ తరగతి స్టూడెంట్స్​కు పెద్ద సైజ్ బ్యాగు అందిస్తారు. కిట్ల సరఫరా, పంపిణీ వివరాలను పక్కాగా అధికారిక వెబ్​సైట్లలో నమోదు చేయాల్సి ఉంటుంది.