Breaking News

చైతన్యంతోనే కరోనా కట్టడి

చైతన్యంతోనే కరోనా కట్టడి

సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్ విషయంలో ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధేశించిన మార్గదర్శకాలు, తగిన జాగ్రత్తలు పాటిస్తే భయపడాల్సిన పనిలేదని నగర పాలక కమిషనర్ డీకే బాలజీ సూచించారు. శనివారం నగరంలోని పలు డివిజన్లలో కలియ తిరిగి కరోనా నిర్ధారణ పరీక్షలను పరిశీలించి సూచనలు ఇచ్చారు. మహమ్మారికి భయపడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని మస్కులను ధరించడం, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం మరువద్దని, ఇంట్లోనే ఉండి మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. నగరపాలక ప్రజారోగ్యాధికారి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.