సారథి న్యూస్, హుస్నాబాద్: చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అన్ని అర్హతలు ఉన్న చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, చిరంజీవులు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జెడ్పీటీసీ కళావతి, బీజేపీ మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమారాణి, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కార్యదర్శి బీరన్న, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్, సీపీఐ పట్టణ కార్యదర్శి అంజయ్య గౌడ్, ఐఎఫ్ టీయూ జిల్లా నాయకులు మహేందర్, పీడీఎస్ యూ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నరేశ్, వికలాంగుల హక్కుల సంఘం అధ్యక్షుడు రమేశ్, మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సత్యనారాయణ, మరో 40 మంది పాల్గొన్నారు.
- July 18, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- CHERYALA
- CONGRESS
- CPI
- SIDDIPET
- TRS
- అఖిలపక్షం
- హుస్నాబాద్
- Comments Off on చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయండి