సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ వరద కాల్వపై మోతె కాల్వల నిర్మాణానికి భూమి పూజ చేసి ఏడాది గడిచినా ఇప్పటికి పనులు ప్రారంభించకపోవడంతో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్మేడిపల్లి సత్యం, ఆ పార్టీ నాయకులు శుక్రవారం వినూత్నరీతిలో చెవిలో పువ్వులతో నిరసన వ్యక్తం చేశారు. ఏడాది క్రితం ఎంతో అట్టహాసంగా జిల్లా మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేసి ఇప్పటివరకు ఒక్క రూపాయి పని కూడా మొదలు పెట్టలేదని ఎద్దేవా చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతమైన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు నీళ్లు ఇవ్వకుండా సీఎం సొంత జిల్లాకు నీళ్లు తీసుకెళ్తుంటే ఇక్కడి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యేకు కమీషన్ల పైన ఉన్న శ్రద్ధ రైతాంగంపై లేదన్నారు.
- June 26, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- ETALA RAJENDAR
- GODAVARI
- SHANAGAR
- కాంగ్రెస్
- మంత్రి ఈటల
- రామడుగు
- షానగర్
- Comments Off on చెవిలో పూలతో వినూత్న నిరసన