జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ సక్సెస్ అయింది. ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాల హీరో అయిన జగపతిబాబు ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రలు పోషిస్తున్నాడు. సౌత్ చిత్రాలన్నింటిలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం జగపతి బాబు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించనున్నారనే వార్తొకటి వచ్చింది. ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘లూసిఫర్’ చిత్రం తెలుగు రీమేక్‌గా తెరకెక్కనుంది. సుజీత్ కొద్దిరోజులుగా ఈ స్క్రప్టు పై పనిచేస్తున్నాడు. పొలికల్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలకపాత్రలో నటించనున్నాడట. దీని గురించి సంస్థతో డీల్ కూడా కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే టీమ్ సభ్యులు అధికారికంగా ప్రకటించే వరకూ ఆగాల్సిందే మరి.
- July 2, 2020
- Archive
- సినిమా
- CHIRANJEEVI
- MEGASTAR
- చిరు
- జగపతిబాబు
- Comments Off on చిరు సినిమాలో జగపతిబాబు