సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: వంగూరు మండలం డిండిచింతపల్లికి చెందిన నిరుద్యోగ పట్టభద్రుడు, గురుకుల పూర్వవిద్యార్థి సూగూరు రామచంద్రం హోటల్‌ను కూల్చివేసిన దుండగులను శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జనవరి 11న నిర్వహించతలపెట్టిన ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాజంలోని అన్నివర్గాలు, సామాజిక ఉద్యమ సంఘాల మద్దతును దృష్టిలో ఉంచుకుని, అందరినీ కలుపుకుని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే తాత్కాలికంగా వాయిదావేసినట్లు ఆయన స్పష్టంచేశారు. త్వరలో తదుపరి తేదీ, కార్యాచరణను ప్రకటిస్తామని, ఈ విషయాన్ని జై భీమ్ యూత్ ఇండియా నాయకులు, కార్యకర్తలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
- January 10, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- DINDI CHINTHAPALLY
- JAIBHEEM YOUTH
- NAGARKURNOOL
- VANGOOR
- డిండిచింతపల్లి
- నాగర్‌కర్నూల్
- వంగూరు
- Comments Off on ‘చలో కలెక్టరేట్’ వాయిదా