Breaking News

చదువుతోనే జీవితాల్లో వెలుగులు


సారథి న్యూస్, వనపర్తి: చదువు ద్వారానే దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ అన్నారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో అంబేద్కర్​ జాతర కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరచింత విజయ్ కుటుంబాన్ని మంగళవారం కలిశారు. అణగారిన బతుకుల్లో వెలుగులు నింపేందుకు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ​ఆర్ఎస్ ​ప్రవీణ్​ కుమార్ ​కృషిచేస్తున్నారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో మనమంతా నడవాలని పిలుపునిచ్చారు. స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్, సాయిబాబా, కురుమూర్తి, మహిపాల్ పాల్గొన్నారు.