- వర్షాలకు ఇంట్లో నీటి ఊట
- ఇబ్బందుల్లో ఓ పేద కుటుంబం
సారథి న్యూస్, మానవపాడు: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని మద్దూరు గ్రామంలో గఫూర్ ఇంటిలో నీటి ఊట ఊరుతోంది. ఇంట్లో మొత్తం అడుగు మేర నీళ్లు నిలిచాయి. ఇద్దరు పిల్లలతో కంటికి కునుకులేకుండా గడుపుతున్నామని భార్యాభర్తలు వాపోయాయి. ‘ప్రతిరోజు చస్తూ బతుకుతున్నాం. చిన్నవర్షం కురిసినా ఇంట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎవరూ మమ్మల్ని పట్టించుకునేవారు లేరు. ఇద్దరు పిల్లలతో నరకం అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా మాకు దారిచూపండి’ అని గఫూర్, అతని భార్య ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు.