సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లిలో శుక్రవారం పల్లె ప్రకృతి వనం పనులను సర్పంచ్ సరిత మల్లేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతివనం చుట్టూ ఫెన్సింగ్ చుట్టి తొందరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రమావత్ రాజు, ఈజీఎస్ ఏపీవో సుధాకర్, టీఎస్ సుభాష్, విఠల్ నాయక్, విజయ్, కోటయ్య పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనులపై ఆరా
మండలంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రమాకాంత్ పరిశీలించారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్యం, హరితహారంలో నాటిన మొక్కల వివరాలు, అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారం తదితర వివరాలను ఆరాతీశారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో పల్లెప్రగతి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులపై పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు కుంట్ల రాములు, సరిత మల్లేశం, పంచాయతీ కార్యదర్శులు నరసింహాగౌడ్, ఈజీఎస్ టి.సుధాకర్ పాల్గొన్నారు.
- December 11, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- medak
- PALLEPRAGATHI
- PEDDASHANKARAMPET
- RURAL DELOPMENT
- పల్లెప్రగతి
- పెద్దశంకరంపేట
- ప్రకృతివనం
- మెదక్
- రూరల్ డెవలప్మెంట్
- Comments Off on చకచకా పల్లె ప్రగతి పనులు