సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి వేడుకలు కర్నూలు నగరంలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నగరంలోని బుధవారపేట 15 వార్డులో సమన్వయకర్త మాదారపు కేదార్ నాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ బి.వై. రామయ్య ప్రారంభించారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు జనహృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని ఆయన అన్నారు. లక్షలాది మంది విద్యార్థులు చదువుకునేందుకు విద్యపై ప్రత్యేకచర్యలు తీసుకుని ఫీజు రీయింబర్స్మెంట్ స్కీంను ప్రవేశపెట్టారని అన్నారు. తాగు, సాగునీటి కోసం ఎన్నో ప్రాజెక్టులను ప్రారంభించారని వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం వెంకటేశ్ వరమ్మా, వాణి, సుగుణ, సుచరిత, చెన్నమ్మ, జమేల, రైల్వేప్రసాద్, ఆదిమోహన్, ఆసిఫ్, నయీం, కిరణ్, రాజేష్, నవీన్ కుమార్ పాల్గొన్నారు.
- September 2, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- Kurnool
- NADYALA
- YSR
- YSRCP
- కర్నూలు
- నంద్యాల
- రక్తదాన శిబిరం
- వర్ధంతి
- వైస్సార్
- Comments Off on ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు