నందమూరి నటసింహం, బాలకృష్ణ షష్టిపూర్తి సందర్భంగా బుధవారం ఆయన ఇంట్లో నందమూరి, నారా వారి కుటుంబసభ్యుల మధ్య బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రహ్మణి, భరత్, తేజస్విని, మోక్షజ్ఞ తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లోని పాత్రలతో రూపొందించిన బ్యానర్లు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘వింటేజ్ ఎన్బీకే 1960’ థీమ్‌తో రూపొందించిన ప్రత్యేకమైన టీషర్టులను బ్రహ్మణి, భరత్, తేజస్విని, మోక్షజ్ఞ ధరించి సందడి చేశారు.
- June 12, 2020
- Archive
- BALAKRISHNA
- BIRTHDAY
- NANDAMURI
- చంద్రబాబు
- బాలకృష్ణ
- లోకేశ్
- వింటేజ్ ఎన్బీకే
- Comments Off on ఘనంగా బాలకృష్ణ బర్త్ డే వేడుకలు