సారథి న్యూస్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం రాత్రి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిపించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠించారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు. అనంతరం శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించారు. తగిన జాగ్రత్తలతో భౌతికదూరం పాటిస్తూ పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించామని ఈవో రామారావు తెలిపారు.
- September 13, 2020
- Archive
- Top News
- ఆధ్యాత్మికం
- BRAMARAMBHA
- EO RAMARAO
- MALLIKARJUNASWAMY
- SRISAILAM
- ఈవో రామారావు
- భ్రమరాంబ
- మల్లికార్జునస్వామి
- శ్రీశైలం
- Comments Off on ఘనంగా పల్లకీ సేవ