సారథి న్యూస్, ధర్మారం(రామగుండం): అన్ని గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తామని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ బహూకరించి నెలకొల్పిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మండల కేంద్రంలో ప్రధాన రహదారిని వీలైనంత వరకు వెడల్పు చేసి అత్యాధునిక వీధిదీపాలను ఏర్పాటు చేసుకుందామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.4,82,500 విలువైన చెక్కులను 9మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు.
- October 2, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- GANDHI JAYANTHI
- KOPPULA TRUST
- PEDDAPALLI
- RAMAGUNDAM
- కొప్పుల ట్రస్ట్
- గాంధీ జయంతి
- పెద్దపల్లి
- రామగుండం
- Comments Off on గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి