Breaking News

గ్రామవలంటీర్​ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

గ్రామవలంటీర్​పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 1036 గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదవ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండి.. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా, అభ్యర్థులు త్వరగా ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పోస్టులు 1,036 (నెల్లూరు 273, చిత్తూరు 374, శ్రీకాకుళం 85, తూర్పు గోదావరి 65, గుంటూరు 239) ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. ఇంటర్వ్యూ విధానంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన, గతంలో పని చేసిన అనుభవం, కమ్యూనికేషన్ స్కిల్స్‌ అంశాలను పరీక్షించనున్నట్లు పేర్కొంది. దరఖాస్తులను ఆగస్టు 28 నుంచి స్వీకరించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 1వ తేదీ (నెల్లూరు, శ్రీకాకుళం), సెప్టెంబర్ 4వ తేదీ (చిత్తూరు, తూర్పుగోదావరి), సెప్టెంబర్‌ 5వ తేదీ(గుంటూరు) వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఈ వెబ్​సైట్​ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. https://gswsvolunteer.apcfss.in/