Breaking News

గ్యాంగ్‌స్టర్ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్

గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉదయం కాల్చి చంపారు. దూబే పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడని సమాచారం. కరడుకట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్ నగరానికి తీసుకువస్తున్న కారు శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. భారీ వర్షం కురుస్తుండటంతోపాటు రోడ్డు సరిగా లేకపోవడం వల్ల కారు ప్రమాదానికి గురై బోల్తా పడిందని యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెప్పారు. కారు ప్రమాదవశాత్తూ బోల్తా పడగానే గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే పరాిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. దూబే ప్రయాణిస్తున్న కారు బోల్తా పడిన ప్రదేశంలో కాల్పుల శబ్ధం వినిపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు.