Breaking News

గోళ్ల అందానికీ ఓ లెక్కుంది

గోళ్ల అందానికీ ఓ లెక్కుంది

గోళ్లకు రంగేయడం అనుకున్నంత ఈజీ కాదు. ఏ మాత్రం అటూఇటూ అయినా గోళ్లందమంతా పోతుంది. పైగా గోళ్లు పాడవుతాయి కూడా. అలా కాకుండా పర్​ఫెక్ట్​ లుక్​తో గోళ్లు మెరవాలంటే రంగువేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

నెయిల్ పాలిష్​వేసుకునే ముందు గోళ్లను శుభ్రం చేసుకుని షేప్​ చేయాలి. తర్వాత పారదర్శకంగా ఉండే బేస్​కోట్​ను వేయాలి. అది పూర్తిగా ఆరిన తర్వాతే నెయిల్​పాలిష్​అప్లై చేయాలి. షేడ్స్​ ఇవ్వాలనుకంటే వాటిల్లో ఒకటి ముదురు రంగులో ఉండేలా చూసుకోవాలి. అలాగే గోళ్ల రంగును గోరు మొదలు నుంచి చివరి వరకు ఒకేదిశలో వేయాలి. అది కాస్త పలుచగా ఉండేట్లు చూసుకోవాలి. ఆరిన తర్వాత మరోసారి నెయిల్​పాలిష్​వేయాలి.

నెయిల్ స్టిక్కర్స్ వాడేటప్పుడు వాటిని గోరు అంచుల దాకా అంటించాలి. దాని మీద పూసే టాప్​కోట్​నెయిల్​పాలిష్ కూడా గోరు అంచుల వరకూ వేయాలి. అలాచేస్తే అంచుల నుంచి రంగు ఊడకుండా తాజా నెయిల్ పాలిష్​లుక్​వస్తుంది. అలాగే గోళ్ల రంగు వేసినప్పుడు బబుల్స్ ఏర్పడకుండా ఉండాలంటే బాటిల్​ను ఎక్కువగా ఊపకూడదు.

చాలామంది స్నానం చేసిన వెంటనే నెయిల్​పాలిష్​వేస్తుంటారు. కానీ, స్నానం చేసిన తర్వాత గోళ్లు తడిగా ఉండి నెయిల్​పాలిష్​త్వరగా ఆరదు. అందువల్ల వెంటనే కాకుండా గోళ్లు తడారి పోయాక రంగు వేయాలి. పాలిష్​వేసుకున్న గోళ్లను ఐస్​క్యూబ్స్​కరిగించిన చల్లటి నీళ్లలో ముంచాలి. అలా చేస్తే వేసుకున్న రంగు చిటికెలో ఆరిపోతుంది.

వేసుకున్న గోళ్ల రంగు గ్లాసీగా ఉంటే ఉడికే అన్నం గిన్నె మీద ఉంచి గోళ్లకు ఆవిరి పట్టాలి. ఆ ఆవిరికి గ్లాసీ గోళ్ల రంగు మ్యాటీగా మారుతుంది. అలాగే నెయిల్ కలర్​ కొట్టొచ్చినట్టు కనిపించాలంటే వైట్ కలర్​ నెయిల్ పాలిష్​ను బేస్​కోట్​గా వేయాలి.
పొరపాటున ఒక గోరు ఇరిగి.. మిగతా గోళ్లన్నీ పొడవుగా ఉంటే నెయిల్ పాలిష్​అంతగా సెట్ అవ్వదు. అలాంటప్పుడు మిగతా గోళ్లను విరిగిన గోరు సైజుకు కత్తిరించి వాటిమీద చమ్కీ అంటించాలి. అలాగే నెయిల్స్​ను ఎప్పటికప్పుడు హైడ్రేట్ చేస్తూ ఉండాలి. దానివల్ల గోళ్లు త్వరగా విరగవు పైగా వేగంగా పెరుగుతాయి.
::: ఎన్​ఎన్​