జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్‌తో పాటు 18 మందికాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం పడిపోయిన విషయం తెలిసిందే. వచ్చేవారం బలపరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం అశోక్ గెహ్లాట్ గవర్నర్‌ను కలిశారని తెలుస్తోంది. బీటీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లాట్‌కు మద్దతు ఇవ్వడంతో గెహ్లాట్ గవర్నర్‌ను కలిశారని చెప్పారు. సీఎం గెహ్లాట్ నివాసంలో జరిగిన సీఎల్పీ భేటీ సందర్భంగా కాంగ్రెస్‌కు తమ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు కొన్ని డిమాండ్లు కూడా చేసినట్లు తెలుస్తోంది.
- July 19, 2020
- Archive
- Top News
- జాతీయం
- ASHOKGEHLOT
- BTP
- CONGRESS
- RAJASTAN
- అశోక్ గెహ్లాట్
- బీటీపీ
- రాజస్థాన్
- Comments Off on గెహ్లాట్‌కు బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు