అమితాబచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం ‘గులాబో సితాబో’. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రోని లాహిరి, షీల్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీని జూన్ 12న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయనున్నారు. శనివారం విడుదలైన ట్రైలర్ మాత్రం అంచనాలను పెంచేదిగా ఉంది. రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ సరదాగా సాగిపోయే సన్నివేశాలతో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.
అమితాబ్ ఒక పాత ఇంటికి యజమాని. ఆయన ఇంట్లో ఆయుష్మాన్ అద్దెకు ఉంటాడు. ముస్లింగా అబితాబ్, హిందువుగా ఆయుష్మాన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. బిగ్ బీ యాక్షన్ సినిమాకే హైలెట్‌గా నిలవనుంది. ఆయుష్మాన్ కూడా తన నటనతో మెప్పించాడు. ఈ సినిమా ఇలా బుల్లితెర మీద కాకుండా థియేటర్లో చూడాలనే కోరిక కలిగించేలా చేసింది ట్రైలర్. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా వెండితెర మీద అయితేనే బాగుంటుంది అంటున్నారు ఇండస్ర్టీవర్గాల వారు.