Breaking News

గురుకుల డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు

గురుకుల డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌నల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ (టీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్) డిగ్రీ గురుకులాలో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి అర్హులైన మ‌హిళా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టులు ఇవే
తెలుగు, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, పిజిక్స్, బోటనీ , జువాలజీ, జియాలజి, కామర్స్‌ మాథ్స్, ఎకానామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, మైక్రో బయాలజీ, సోషయాలజి, సైకాలజీ, జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, జెనిటిక్స్, జియోగ్రఫీ, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, డైటిటిక్స్ సబ్జెక్టులలో మహిళా అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హ‌త‌
55శాతం అంత‌ క‌న్నా ఎక్కువ మార్కుల‌తో పోస్టు గ్రాడ్యుయేష‌న్ (పీజీ) ఉత్తీర్ణ‌త‌. (ఎస్సీ, ఎస్టీలకు 50శాతం, పీహెచ్​డీ, నెట్, స్లెట్, ఎంపిల్ ఉన్న వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
వేతనం : రూ.25,000 నుంచి రూ.30,000 వరకు ఉంటుంది.
పరీక్ష విధానం : 100 మార్కులకు (రాత పరీక్ష – 75, ఇంటర్వ్యూ & డిమానుస్ట్రేషన్ – 25)
దరఖాస్తు ఫీజు : రూ.500
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ : 18.10.2020
పరీక్ష తేదీ : 31. 10. 2020
వెబ్​సైట్​ : https://www.tswreis.in/లో సంప్రదించవచ్చు.